ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది యువత కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ తమ అద్బుత సృజనాత్మకతను చాటుకుంటున్నారు. థర్మల్, హైడల్, పవన విద్యుత్తులు, బ్యాటరీలు, ఇంధనాలతో నడిచే మోటార్లకు భిన్నంగా ఓ యువకుడు అయస్కాంతాలతో నడిచే మోటార్ ను తయారు చేసి అద్బుతం సృష్టించాడు. పొలానికి నీటిపారుదల కోసం విద్యుత్తు లేకుండా తన వినూత్న పంప్ సెట్ తో కేవలం అయస్కాంతాలతో నీటిని పంపింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
ఓ సైకిల్ చక్రం, దానికి అయస్కాంతాలను పట్టుకున్న ఎరుపు రంగు వంపు తిరిగిన ఇనుప పట్టిలతో కూడిన యంత్రాన్ని పంప్ సెట్ కు ఆ యువకుడు అనుసంధానించాడ. ఇనుప పట్టిలను వృత్తాకారంలో జతచేయగానే…అయస్కాంతా ఆధారిత పద్ధతిలో ఆ వెంటనే చక్రం తిరుగుతూ పంప్ సెట్ నుంచి నీరు బలంగా పొలంలోకి పారుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది క్షేత్ర స్థాయిలో విజయవంతమైతే వ్యవసాయ రంగంలో భారీగా విద్యుత్తు ఆదాకు అవకాశం ఉంటుందని…నిజంగా ఆ యువకుడి ఆలోచన..సృజనాత్మకతను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. అయితే ఆయస్కాంత యంత్రం పనితీరు, దాని సామర్ధ్యం ఎంతమేరకు విజయవంతమవుతుందో చూడాల్సి ఉందని..దీనిపై ప్రభుత్వంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.
విద్యుత్ అవసరం లేకుండానే కేవలం అయస్కాంతాలతో మోటార్ నడిపి పొలానికి నీళ్ళు పెడుతున్న వైనం pic.twitter.com/otgQagXPGD
— UttarandhraNow (@UttarandhraNow) June 29, 2026
