ఇదో విచిత్ర పంచాయితీ. అత్తాకోడళ్ల మధ్య నెలకొన్న చీరల పంచాయితీ ఇది. అత్తేమో మోడ్రన్.. కోడలేమో కామన్ వుమెన్. తాను జీన్స్, టాప్ వేసుకుంటున్న మాదిరిగానే.. కోడలు కూడా జీన్స్ వేసుకోవాలని అత్త డిమాండ్ చేస్తోంది
లక్నో: ఇదో విచిత్ర పంచాయితీ. అత్తాకోడళ్ల మధ్య నెలకొన్న చీరల పంచాయితీ ఇది. అత్తేమో మోడ్రన్.. కోడలేమో కామన్ వుమెన్. తాను జీన్స్, టాప్ వేసుకుంటున్న మాదిరిగానే.. కోడలు కూడా జీన్స్ వేసుకోవాలని అత్త డిమాండ్ చేస్తోంది. కానీ కోడలేమో తనకు జీన్స్, టాప్ ఇష్టం లేదు.. చీరలే కడుతానని భీష్మించింది. ఈ పంచాయితీ పోలీసు స్టేషన్ దాకా చేరింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ యువకుడికి మూడు నెలల క్రితం వివాహమైంది. ఆ యువకుడి తల్లి ప్రతి రోజు జీన్స్, టాప్స్ ధరిస్తోంది. ఇక కోడలు పిల్ల మాత్రం రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి.. చీరలు ధరిస్తోంది. ఇది అత్తకు నచ్చలేదు. తనలాగే జీన్స్ ధరించాలని ఒత్తిడి చేసింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో అతను కూడా తల్లికే వత్తాసు పలికాడు.
అత్త, భర్త వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త, భర్తను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అత్త, కోడళ్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు.