New Parliament | వావ్‌ అనిపిస్తున్న కొత్త పార్లమెంట్‌..! ఇంటీరియర్‌ డిజైన్‌ మీరూ చూసేయండి..!

New Parliament | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తయ్యింది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని సరికొత్త హంగులతో నిర్మించారు. లాంజ్, లైబ్రరీ, కమిటీ హాల్, క్యాంటీన్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దాదాపు రూ.1200కోట్లతో నిర్మించిన అత్యాధునిక పార్లమెంట్‌లో భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులు […]

  • Publish Date - May 25, 2023 / 01:58 AM IST

New Parliament | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తయ్యింది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని సరికొత్త హంగులతో నిర్మించారు. లాంజ్, లైబ్రరీ, కమిటీ హాల్, క్యాంటీన్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

దాదాపు రూ.1200కోట్లతో నిర్మించిన అత్యాధునిక పార్లమెంట్‌లో భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నది. ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌ ఆవిష్కరించనున్న సందర్భంగా ఇంటీరియర్‌ డిజన్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్ రూపొందించింది. ఈ కంపెనీ ఇంతకుముందు గాంధీనగర్‌లోని సెంట్రల్ విస్టా, స్టేట్ సెక్రటేరియట్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అనేక ప్రాజెక్టులను రూపొందించింది. ఇక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ చేపట్టింది.

కొత్త పార్లమెంట్ హౌస్ త్రిభుజాకారంలో డిజైన్ చేశారు. లోక్‌సభలో 888 సీట్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. సందర్శకుల గ్యాలరీలో 336 మందికి పైగా సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. రాజ్యసభలో 384 సీట్లు, విజిటర్స్ గ్యాలరీలో 336 మందికిపైగా కూర్చునేందుకు ఏర్పాట్లున్నాయి. పార్లమెంట్‌ ఉభయ సభల సందర్భంగా 1,272 మంది సభ్యులు కూర్చునే ఏర్పాట్లున్నాయి.

లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లో ఒక్కో బెంచ్‌పై ఇద్దరు సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి సీటుకు డిజిటల్ సిస్టమ్, టచ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో సరికొత్త ఆడియో-విజువల్ సిస్టమ్స్ సౌకర్యాలున్నాయి.

కొత్త పార్లమెంటు భవనంలోని లోక్‌సభ జాతీయ పక్షి నెమలిని పోలి ఉంటుంది. రాజ్యసభ జాతీయ పుష్ప కమలం నమూనాలో రూపొందించారు. దేశంలోని వివిధ ప్రాంతీయ కళలు, హస్తకళలు కొత్త భవనంలో ప్రదర్శించనున్నారు. ఇది ఆధునిక భారతదేశపు చైతన్యం, వైవిధ్యాన్ని ప్రతిబింబింబించనున్నది.

64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త పార్లమెంట్‌లో భూకంపాన్ని తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రెయిన్వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, పైకప్పులపై సోలార్ పవర్ ప్యానెళ్లను కలిగి ఉంటాయి. కొత్త పార్లమెంట్ భవనంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త పార్లమెంట్ హౌస్‌లో ముఖ్యమైన పనుల కోసం ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కేఫ్, డైనింగ్ ఏరియా, కమిటీ సమావేశ గదుల్లో కూడా హైటెక్ హంగులను కల్పించారు.

కొత్త పార్లమెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన రాజ్యాంగ హాలు నిలువనున్నది. ఇది భవనం మధ్యలో నిర్మించారు. దానిపై అశోక స్తంభం ఉంటుంది. ఈ హాలులో రాజ్యాంగ ప్రతిని ఉంచుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10, 2020న కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. మే 28, 2023న పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి ఆరేళ్లు పట్టగా, కొత్త భవనాన్ని నిర్మించడానికి మూడేళ్లు పట్టింది.

పాత పార్లమెంట్‌ భవన నిర్మాణానికి రూ.83లక్షల ఖర్చు చేయగా.. సమాచారం మేరకు కొత్త పార్లమెంట్‌ భవనానికి రూ.1200కోట్ల ఖర్చు చేశారు. కొత్త భవనం ప్రస్తుత పార్లమెంట్ భవనం ఎత్తుతో సమానంగా ఉంటుంది. ఇది బేస్‌మెంట్‌తో సహా మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. కొత్త భవనం పాత భవనం కంటే దాదాపు 17,000 చదరపు మీటర్లు పెద్దదిగా ఉంటుంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయాణంతో పాటు విభిన్న సంస్కృతి, వారసత్వాలను కళ్లకు కట్టనున్నది.

Latest News