పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. లోక్‌సభ మూడో రోజూ వాయిదా పడింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 22, 2026, 12:00 pm IST
Read Time: 2 mins
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ తో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలు దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం కూడా కొనసాగాయి.

ఢిల్లీలోని పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మూడో రోజు లోక్‌సభ వాయిదా

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన మూడో రోజు కూడా వాయిదా పడ్డాయి. సభా సమయం ప్రారంభం కాగానే నీట్‌ పరీక్షలో అవకతవకలపై డిమాండు చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ వారించినా వినకపోవడంతో చివరకు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.