భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలమైన నేపథ్యంలో విపక్షాలు మహిళలకు జవాబు చెప్పాలని, భారీ రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు.

భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాలు ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకుంటాయని విమర్శించారు. వాటి రాజకీయ జీవన పర్యంతం దీనిపై పశ్చాత్తాప పడుతాయన్నారు. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకమనే విషయం ప్రతి గ్రామానికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లను వ్యతిరేకించి ప్రతిపక్షం తప్పు చేసిందని.. పర్యవసానాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు మహిళలకు ప్రతిపక్ష సభ్యులే సమాధానం చెప్పుకోవాలన్నారు.

కాగా… పార్లమెంటులో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంతో విపక్షాల మద్దతు సాధించడంలో కేంద్రం విఫలమైంది. బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు కేవలం 298 మంది మాత్రమే ఆమోదం తెల్పగా.. 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాటితో పాటు ప్రతిపాదించిన కేంద్ర పాలిత ప్రాంతాల నియోజకవర్గాల సవరణ, డీలిమిటేషన్ బిల్లును కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది.

ఇవి కూడా చదవండి :

కేపీహెచ్‌బీలో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం – ప్రయాణికులు సురక్షితం : వీడియో
మహిళ బిల్లు ముసుగులో బీజేపీ కుట్ర రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి