Modi Assam Visit : తేయాకు తోటల్లో ప్రధాని మోదీ.. అస్సాం ఎన్నికల ప్రచార చిత్రం!

అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దిబ్రూగఢ్ తేయాకు తోటలను సందర్శించి మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు.

Modi Assam Visit

విధాత,: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా తేయాకు తోటల్లో ప్రత్యక్షమై అక్కడి మహిళా కార్మికులను ఆశ్చర్యపరిచారు. బుధవారం దిబ్రూగఢ్‌లోని ఓ తేయాకు తోటను సందర్శించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. తేయాకు సేకరణ విధానాన్ని పరిశీలించారు. తేయాకు సేకరణ, రవాణ, విక్రయాల వివరాలను తెలుసుకున్నారు. వారితో కలిసి అస్సాం సాంప్రదాయ నృత్యంలో సందడి చేశారు.

తేయాకు తోట సందర్శన..అస్సాం మహిళలతో ముచ్చట..వారి స్వాగత నృత్యాలపై స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని తెలిచేశారు. ఇది ఒక అత్యంత మధురమైన అనుభవం అని పేర్కొన్నారు. తేనీరు అస్సాం ఆత్మ!..అని, ఇక్కడి తేనీరు ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇలాంటి స్టంట్లు అలవాటేనంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేశాయి.

 

ఇవి కూడా చదవండి :

Varanasi Ganga Ghat | గంగా ఘాట్ లో పూజారి దుర్మార్గం..దేహశుద్ది
Commercial Gas | భారీగా పెరిగిన క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు..!

Latest News