Delhi Pollution| ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్..స్పోర్ట్స్ పై నిషేధం

పెరిగిన కాలుష్య సమస్యలతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్పోర్ట్ యాక్టివిటీస్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కాలుష్యంతో స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ఆపేయాలని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో ఎలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించరాదని నిర్ణయించింది.

Delhi Pollution| ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్..స్పోర్ట్స్ పై నిషేధం

న్యూఢిల్లీ : పెరిగిన కాలుష్య (Pollution) సమస్యలతో ఢిల్లీ(Delhi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్పోర్ట్ యాక్టివిటీస్ (Sports Ban)ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కాలుష్యంతో స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ఆపేయాలని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే స్పోర్ట్స్ మీట్ ఆపేయాలని ఢీల్లి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 400కిపైనే నమోదవుతోంది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం

శీతాకాలం కారణంగా కాలుష్య సమస్యలు మరింత అధికమైన నేపథ్యంలో.. పాఠశాలల స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ కార్యక్రమాలను వాయిదా వేసేలా ఆదేశించడాన్ని పరిశీలించాలని ‘వాయునాణ్యత నిర్వహణ కమిషన్‌కు సుప్రీం కోర్టు తాజాగా సూచించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యంపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు, డిసెంబరు నెలల్లో అండర్‌-16, అండర్‌-14 విద్యార్థులకు ఇంటర్‌ జోనల్‌ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సీనియర్‌ న్యాయవాది, అమికస్‌ క్యూరీ అపరాజిత సింగ్‌ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే ఈ నెలల్లో ఇటువంటి ఈవెంట్స్‌కు అనుమతించడం.. స్కూల్‌ పిల్లలను గ్యాస్ ఛాంబర్‌లో ఉంచడంతో సమానమేనని వాదించారు. ఈ సమయంలో బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.