జేడీఎస్ నుంచి ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ బహిష్కరణ

అశ్లీల వీడియోల వ్య‌వ‌హారంలో క‌ర్నాట‌క జేడీఎస్‌ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణను ఆ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై వేటు వేస్తున్న‌ట్టు ఆ పార్టీ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మంగ‌ళ‌వారం అధికారికంగా

జేడీఎస్ నుంచి ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ బహిష్కరణ

కుమారస్వామి కీలక ప్రకటన

విధాత : అశ్లీల వీడియోల వ్య‌వ‌హారంలో క‌ర్నాట‌క జేడీఎస్‌ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణను ఆ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై వేటు వేస్తున్న‌ట్టు ఆ పార్టీ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మంగ‌ళ‌వారం అధికారికంగా ప్రకటించారు. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినట్టు కుమారస్వామి అంతకుముందే వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కోర్ కమిటీలో చర్చించి ప్రజ్వల్ రేవణ్ణపై బహిష్కరణ వేటు వేశారు. సోషల్ మీడియాలో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వం రంగంలోకి దిగి చట్టపరంగా విచారణకు ఉపక్రమించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి జేడీఎస్ నాయకత్వానికి ఎదురైంది. ప్రజ్వల్‌పై చర్య తీసుకోవాలని సొంత పార్టీ నుంచి భారీగా డిమాండ్లు వెల్లువెత్తడంతో కుమారస్వామి ఆయనపై వేటు వేశారు.