విధాత : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓ వైపు సినీ తారల సందడి కనిపించగా..మరోవైపు ‘టినా’ యువతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో ‘టినా’ అనే యువతి తమిళ సాంప్రదాయ దుస్తులు (పావాడై సట్టై) ధరించి ఓటర్లను పలకరిస్తూ..వారికి చాక్లెట్లు, గులాబీపూలు (టాఫీలు) ఇచ్చి స్వాగతం పలుకుతూ అందరిని ఆకట్టుకుంది. అయితే టీనా నిజమైన యువతి కాదండోయ్..ఆ కాలేజీ విద్యార్థులు తమ మేధస్సుతో రూపొందించిన ఓ రోబో.
ఈ టీనా రోబోను ఆ కాలేజ్ విద్యార్థులే రూపొందించి, జాయ్‌స్టిక్ సాయంతో ఆపరేట్ చేస్తున్నారు. ఓటర్లలో పోలింగ్ పై భయాలు, సందేహాలు పోగొట్టి, కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచడానికే వినూత్నంగా టీనా రోబోను వినియోగించినట్లుగా విద్యార్థులు తెలిపారు. టీనా రోబో ప్రయోగం పోలింగ్ కేంద్రం వద్ద ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువతను, విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి :
AK 47 |వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో భారీ సినిమా… ‘AK 47’కు తమన్ ఎంట్రీ, హర్షవర్ధన్ ఔట్!
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్
