Sabarmati Express | పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెను ప్రమాదం..!

Sabarmati Express | యూపీ కాన్పూర్‌లో శనివారం తెల్లవారు జామున రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు 20 బోగీలు పట్టాలపై నుంచి కిందకు జారాయి.

Sabarmati Express | పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెను ప్రమాదం..!

Sabarmati Express | యూపీ కాన్పూర్‌లో శనివారం తెల్లవారు జామున రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు 20 బోగీలు పట్టాలపై నుంచి కిందకు జారాయి. ఝాన్సీకి వెళ్తున్న సమయంలో కాన్పూర్‌ – భీమ్‌సేన్‌ స్టేషన్‌ ఏరియా సమీపంలో ప్రమాదం జరగ్గా.. పెను ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆయా మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ ప్రమాదం వివరాలను నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు ధ్రువీకరించారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ (19168) వారణాసి జంక్షన్ – అహ్మదాబాద్ రూట్‌లో రాకపోకలు సాగిస్తుంది.

ఆ రైలే ఇప్పుడు ప్రమాదానికి గురైందని చెప్పారు. అయితే, పట్టాలపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లను పెట్టారని.. ఇంజిన్‌ వాటిని తాకగానే ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యిందని పేర్కొన్నారు. రైలు పట్టాలు తప్పిందన్న సమాచారంతో అధికారులు సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్లను తరలించారు. రెస్క్యూ టీఎంలను పంపారు. రైలులోని ప్రయాణికులను సమీపంలోని రైల్వే స్టేషన్‌కు తరలించేందుకు ఓ బస్సులను పంపారు. ఆ రైల్వే స్టేషను నుంచి వారిని ప్రత్యేక రైలులో గమ్యస్థానాలకు పంపనున్నారు. ఇక ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తును చేపట్టారు.

రైలు ప్రమాదం నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ : 0532-2408128, 0532-2407353, 0532-2408149, కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ : 0512-2323018, 0512-2323016, 0512-23230152, మీర్జాపూర్ రైల్వే స్టేషన్ : 0544-22200973, ఫతేపూర్ రైల్వే స్టేషన్ : 73929646224, నైని జంక్షన్ రైల్వే స్టేషన్ : 0532-26972525, చునార్ జంక్షన్ రైల్వే : 88403778936 : ఎటావా జంక్షన్ రైల్వే స్టేషన్ : 75250012497, హత్రాస్ జంక్షన్ రైల్వే స్టేషన్ : 75250013368, ఫాఫుండ్ రైల్వే స్టేషన్ : 7505720185 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.