అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

విధాత, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. తరుచు ప్రధాన నగరాల ఏయిర్ పోర్టులలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణ అవుతు కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడుతుండటంతో విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. ఈ క్రమంలో తాజాగా 8కిలోల బంగారం పట్టుబడింది.