Solar eclipse | అక్టోబర్ 2న సూర్యగ్రహణం.. కనువిందు చేయనున్న రింగ్ ఆఫ్ ఫైర్.. భారత్‌లో కనిపిస్తుందా..?
Solar eclipse | వినీలాకాశంలో అద్భుత ఘటన చోటు చేసుకోనున్నది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని.. చీకటిగా ఉన్న చంద్రుడికి చుట్టూ సూర్యకాంత్రి ప్రకాశవంతమైన రింగ్ (ఉగరం) ఆకృతిలో కనిపిస్తుందని.. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ పిలుస్తారన్నారు.

Solar eclipse | వినీలాకాశంలో అద్భుత ఘటన చోటు చేసుకోనున్నది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని.. చీకటిగా ఉన్న చంద్రుడికి చుట్టూ సూర్యకాంత్రి ప్రకాశవంతమైన రింగ్ (ఉగరం) ఆకృతిలో కనిపిస్తుందని.. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ పిలుస్తారన్నారు. ఈ అద్భుత దృశ్యం 6 గంటలకుపైగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు ప్రారంభమవుతుందని.. దాంతో ఇక్కడ కనిపించేందుకు అవకాశం లేదని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రం, సౌత్ చిలీ, సౌత్ అర్జెంటీనా తదితర ప్రాంతాల్లో కనిపిస్తుందని వివరించారు.
భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సమయంలో సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. కానీ, చంద్రుడి పరిమాణం చిన్నది కావడంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్ని వలయంలా కనిపిస్తుంది. దాంతో ఉంగరం ఆకృతిలో గ్రహణం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఐదుగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందులో మూడు పూర్తయ్యాయి. మార్చిలో తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. ఏప్రిల్ 8న తొలి చంద్రగ్రహణం కనిపించింది. సెప్టెంబర్ 17-18 మధ్య రెండో చంద్రగ్రహణం ఏర్పడగా.. అక్టోబర్ 2న రెండో సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. అలాగే, అక్టోబర్ 17న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది.