విధాత : క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతమార్పిడి అనంతరం హక్కులపై ఇచ్చిన ఈ తీర్పుతో
క్రైస్తవంలోకి మారిన ఎస్సీలు ఇక మీదట ఎస్సీ గుర్తింపు హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హక్కులు పొందుతారని పేర్కొంది. కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు అని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం విచారించింది. మతమార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.
ఎస్సీలు హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టీకరించింది. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప మరే మతంలో ఉన్నవారూ ఎస్సీ సభ్యులు కాలేరు అని పేర్కొంది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని, కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించబోదని సుప్రీం తేల్చిచెప్పింది.
ఎస్సీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పలేం అని పేర్కొంది. “పాస్టర్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారు, తిరిగి మారలేదు అని, ఎస్సీ కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకున్నారని నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యం అని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా మతం మార్చుకున్న ఎస్సీ వర్గాల రిజర్వేషన్ హక్కులపై పెద్ద చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి :
Lok Sabha Assembly Seats Increase | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!
PAN Card | ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
