తమిళనాడు, బెంగాల్ లో కొనసాగుతున్న పోలింగ్
తమిళనాడు అసెంబ్లీ మొత్తం స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీ మొత్తం స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బూ, కూతురు శృతి హాసన్ తో కలిసి కమలహాసన్, సౌందర్యతో కలిసి రజనీకాంత్ లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్ లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యతం తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు.తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.తొలి విడతలో బెంగాల్ లో 1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు సాగుతుంది. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
తమిళనాడులో ఉదయం 9గంటల వరకు 17.69 శాతం పోలింగ్ , పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి సమయం పడుతుండటం, ఈవీఎంల మొరాయింపు సమయాలను పరిగణలోకి తీసుకుని పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచాలని నటుడు,టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 9న కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.తమిళనాడులో మొత్తం స్థానాలకు, పశ్చిమ బెంగాల్ లో తొలి విడత 152స్థానాలకు గురువారం పోలింగ్ ముగియ్యనుంది. 29న రెండు విడత బెంగాల్ లోని 142 స్థానాలకుఎ పోలింగ్ పోలింగ్ జరుగనుంది. మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి :
భారత దేశ అధికారిక పటంలో ఏపీ రాజధానిగా అమరావతి!
కాళేశ్వరం కేంద్రంగా తెలంగాణ పొలిటికల్ వార్.. హైకోర్టు తీర్పుతో హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram