Tamilnadu Police Rape Andhra Woman | తమిళనాడులో అమానుష ఘటన..యువతిపై పోలీసుల లైంగిక దాడి

తిరువణ్ణామలైలో దారుణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతిపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tamilnadu Police Rape Andhra Woman | తమిళనాడులో అమానుష ఘటన..యువతిపై పోలీసుల లైంగిక దాడి

విధాత: ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కంచ చేను మేసిన చందంగా వ్యవహరించారు. దైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతిపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. సోదరితో కలిసి దైవ దర్శనం వెళ్లే క్రమంలో ఓ టమాటా లోడ్ లారీలో బాధిత యువతి ఎక్కి ప్రయాణిస్తున్నారు. తిరువన్నమలై ప్రాంతంలోని ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్స్ సురేష్ రాజ్, సుందర్ లు ఆపారు. అనుమానం ఉందని అందులోని యువతిని కానిస్టేబుళ్లు కిందకి దిగమని ఆదేశించారు.

వాహన డ్రైవర్ ను, మరో యువతిని కొట్టి తరిమేశారు. వాహనం నుంచి కిందకి దిగిన యువతిని సమీప పొలాల్లోకి లాక్కెళ్లి కానిస్టేబుల్స్ ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున గాయాలపాలైన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు వారిని అరెస్టు చేసి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.