ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !

మధ్యప్రదేశ్ మాధవ్ టైగర్ రిజర్వ్‌లో MT-6 ఆడపులి రైతుల పశువులపై వరుస దాడులతో అధికారులకు తలనొప్పిగా మారింది. మరో అభయారణ్యానికి తరలించే యత్నాలు సాగుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Apr 18, 2026, 4:30 pm IST
Read Time: 3 mins
ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !

విధాత : ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని మాధవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అధికారులకు MT-6 అనే ఓ ఆడ పెద్దపులి తలనొప్పిగా తయారైంది. బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని MT-6 పెద్దపులి పాన్ పాత బఫర్ ఏరియాలోని సమీప గ్రామాల్లోని రైతులకు చెందిన పశువులపై దాడి చేసి తినేయడం అలవాటుగా పెట్టుకుంది. దీంతో రైతుల ఫిర్యాదు మేరకు ఆడపులిని మత్తు మందు ఇచ్చి బంధించి రేడియో కాలర్ ను అమర్చి వాహనంలో మాధవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు తరలించి అడవిలో వదిలేశారు.

ఇప్పుడు MT-6 పెద్దపులి మాధవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అధికారులకు, రైతులకు తలనొప్పిగా తయారైంది. వరుస పెట్టి సమీప గ్రామాల్లోని రైతు పశువులను చంపడం అలవాటుగా మార్చుకుంది. ఈ ఆడపులి తన చిన్నతనం నుండి అలవాటు చేసుకున్న పశువులను ఎత్తుకెళ్లే స్వభావాన్ని వదల్లేదు. ఇది మాధవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల గ్రామాలలో పశువులను చంపడం తినడం అలవాటుగా కొనసాగిస్తుంది. ఈ ఆడపులి 100% పెంపుడు జంతువులనే వేటాడి తింటుంది. అదికూడా పశువులను మాత్రమే కావడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

ఇప్పటి వరకు ఈ ఆడపులి ఒక స్థిరమైన భూభాగాన్ని ఏర్పరచుకోలేకపోయింది. పశువులపై దాడి చేయడమే అలవాటుగా మార్చుకున్న ఆడపులి MT-6 ను తిరిగి బంధించేందుకు రెండుసార్లు మత్తుమందు ఇచ్చారు. మరో అభయారణ్యానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం MT-6 పెద్దపులిని బంధించడం..తరలించడం అటవీ శాఖ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి :

Nayanthara | క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేసిన నయనతార.. పిల్ల‌ల‌తో సంద‌డి మాములుగా లేదు..!
దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది : వైఎస్. షర్మిల