MadhyaPradesh, Borewell | బోరుబావిలో ప‌డ్డ రెండేళ్ళ చిన్నారి.. 24 గంట‌ల్లో 50 అడుగులు కింద‌కి!

MadhyaPradesh Borewell విధాత: రెండేళ్ల చిన్నారి బోరు బావిలో ప‌డిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. రాతి నేల కావ‌డంతో భారీ పొక్లెయిన్‌ల సాయంతో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. ఇక్క‌డి సెహోర్ జిల్లాలో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా 24 గంట‌ల నుంచీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌ కొన‌సాగుతోంది. తాము లోప‌లికి త‌వ్వే కొద్దీ చిన్నారి మ‌రింత లోప‌లికి జారిపోతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు. मध्य प्रदेश: कठोर चट्टानों की वजह से बोरवेल में गिरी सृष्टि […]

MadhyaPradesh, Borewell | బోరుబావిలో ప‌డ్డ రెండేళ్ళ చిన్నారి.. 24 గంట‌ల్లో 50 అడుగులు కింద‌కి!

MadhyaPradesh Borewell

విధాత: రెండేళ్ల చిన్నారి బోరు బావిలో ప‌డిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. రాతి నేల కావ‌డంతో భారీ పొక్లెయిన్‌ల సాయంతో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. ఇక్క‌డి సెహోర్ జిల్లాలో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా 24 గంట‌ల నుంచీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌ కొన‌సాగుతోంది. తాము లోప‌లికి త‌వ్వే కొద్దీ చిన్నారి మ‌రింత లోప‌లికి జారిపోతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

తొలుత బావిలో ప‌డిపోయిన‌పుడు 20 అడుగుల లోతులో ఉండ‌గా.. ప్ర‌స్తుతం చిన్నారి 70 అడుగుల లోతుకు వెళ్లిపోయింది. మొత్తం ఆ బోరు బావిలోతు 300 అడుగుల‌ని స‌మాచారం. లోప‌లికి ఆక్సిజ‌న్ పంపిస్తున్నందు వ‌ల్ల ప్ర‌స్తుతానికి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

త్వ‌ర‌లోనే చిన్నారిని బ‌య‌ట‌కు తీసుకొస్తామ‌ని అధికారులు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. చిన్నారిని ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి కావ‌ల్సిన అన్ని చ‌ర్య‌ల‌నూ తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు.