ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా పీపల్‌కోటి టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుంగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా నీరు, బురద వ్యర్థాలు వచ్చిపడటంతో ప్రమాదం సంభవించింది.ప్రమాద సమయంలో టన్నెల్ లోపల ఉన్న 28 మందిలో ఇప్పటి వరకు 18 మందిని సురక్షితంగా రక్షించగా.. అందులోనే చిక్కుకుపోయిన మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారు.
నీరు, బురద వ్యర్థాలను తొలగిస్తూ.. కార్మికుల జాడ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా పిపాల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో 2కిలోమీటర్ల పొడవైన THDC టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. కార్మికులు లోపల పని చేస్తుండగా..అకస్మాత్తుగా నీళ్లు, బురద లోపలికి రావడంతో 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. నీళ్లు, బురద లోపలికి రావడంతో టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని ప్రమాదం బారిన పడ్డారు.
ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, అన్ని సంబంధిత సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
