Viral Photo | మాజీ ముఖ్యమంత్రిపై మూత్ర విసర్జన.. నిందితుడు అరెస్ట్
Viral Photo | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చిత్రపటంపై మూత్ర విసర్జన చేసి, చివరకు ఉమ్మేశాడు.
Viral Photo | లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చిత్రపటంపై మూత్ర విసర్జన చేసి, చివరకు ఉమ్మేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని చోలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అఖిలేష్‌యాదవ్ ఫోటోలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. అయితే ఓ ఫోటో వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. ఇక చివరకు అఖిలేష్ యాదవ్ ఫొటోపై ఉమ్మేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సమాజ్‌వాదీ పార్టీ నాయకులు చోలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని బాదేలాల్ చౌహాన్‌గా పోలీసులు గుర్తించారు. అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌తో పాటు యాదవ కమ్యూనిటీని బాదేలాల్ పరుష పదజాలంతో దూషించినట్లు వీడియోలో స్పష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. బాదేలాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బాదేలాల్‌ను పోలీసులు జైలుకు తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram