విధాత : బీహార్‌లో ‘జైలజైన్’ అనే ప్రమాదకరమైన డ్రగ్ కలకలం రేపుతోంది. ఈ డ్రగ్ తీసుకున్న ఒక యువకుడు గంటల తరబడి రోడ్డుపై కదలకుండా బొమ్మలా నిలబడిపోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మెదడు పనితీరును మొద్దుబార్చే ఈ డ్రగ్ ప్రభావంతో మనుషులు స్పృహలో ఉన్నా ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోతారు. ఓ రకంగా హాలీవుడ్ సినిమాలోని జాంబీల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అందుకే ఇంటర్నెట్‌లో దీనిని ‘జాంబీ డ్రగ్’ అని పిలుస్తున్నారు.
ఈ వింత ప్రవర్తనకు కారణమైన డ్రగ్ మెదడు పనితీరును పూర్తిగా స్తంభింపజేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్ బారిన పడిన వారు తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్లిపోతారని, ఇది ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బీహార్ తో పాటు జాంబీ డ్రగ్ ఘటనలు బెంగళూరు నగరంలోనూ వెలుగు చూడటం మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ మత్తు పదార్థాల విక్రయాల వెనుక ఉన్న ముఠాల గురించి పోలీసులు నిఘా పెంచారు. యువత ఇలాంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Bihar is slipping into a drug crisis—and it’s happening in plain sight.
Kids and young people openly taking drugs on roads, in parks, on streets… and those in power are busy looking the other way.
How long will this apathy continue?
This isn’t just negligence—it’s a complete… pic.twitter.com/aBWdnBKP1f— Magadh Updates (@magadh_updates) April 8, 2026
ఇవి కూడా చదవండి :
Triumph 350 CC Engine | ఇంజిన్ కెపాసిటీ తగ్గింది.. ధర మాత్రం పెద్దగా తగ్గలేదు.. నిరాశపరిచిన ట్రయంఫ్ నిర్ణయం!
OnePlus Nord 6 | 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. పవర్‌బ్యాంక్‌లా వాడే టెక్నాలజీ కూడా!
