World’s most powerful passports 2024 | అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఏ దేశానిదో తెలుసా? మరి మనది?
భారత పాస్‌పోర్టు 82వ స్థానంలో ఉంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు 58. వీటిలో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ లాంటి పర్యాటక దేశాలు కూడా ఉన్నాయి.

ప్రపంచ పాస్‌పోర్టు ర్యాంకులను ప్రతీ ఏటా విడుదల చేసే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్(Henley Passport Index 2024) 2024వ సంవత్సరానికి ర్యాంకులను విడుదల చేసింది. దీని ప్రకారం 2024వ సంవత్సరానికి గానూ సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రథమస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (International Air Transport Association- IATA) సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులను రూపొందిస్తారు. ఐటా అత్యంత ఖచ్చితమైన విమాన యాన సమాచారాన్ని కలిగిఉంటుంది. భారత్(Indian Passport) ఈసారి 82వ(82nd Rank) స్థానాన్ని సెనెగల్, తజకిస్తాన్ దేశాలతో కలిపి పంచుకుంది. భారత పాస్‌పోర్ట్(Indian Passport)తో 58 దేశాలకు(58 Countries) వీసా రహిత ప్రయాణం(Visa-Free Travel) చేయొచ్చు. 2023వ ఏడాదిలో 60 దేశాలకు వీసా రహిత ప్రయాణాలతో 84వ ర్యాంకులో ఉన్న భారత్, ఈసారి రెండు దేశాలను కోల్పోయి, రెండు స్థానాలు దిగజారింది(India lost 2 countries and 2 ranks).
సింగపూర్(Singapore) పాస్‌పోర్ట్ అత్యంత ప్రభావవంతమైన పాస్‌పోర్ట్‌గా ఒకటవ(1st Rank) స్థానంలో నిలిచింది. ఇది 195 దేశాలకు వీసా రహిత ప్రయాణాల(195 Visa-free Countries)ను అనుమతిస్తుంది. ఈ జాబితా ప్రకారం, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ సంయుక్తంగా 192 వీసారహిత దేశాలతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, 3వ స్థానంలో ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లండ్, లక్సెంబర్గ్, నెదర్ల్యాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలున్నాయి. వీటి పాస్‌పోర్టులు 191 దేశాలకు వీసా రహిత ప్రయాణాలను అనుమతిస్తాయి. న్యూజీల్యాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతో కలిసి యూకే 4వ స్థానాన్ని కైవసం చేసుకోగా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ 5వ స్థానానికి చేరుకున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికా(USA at 8th Rank) మాత్రం 8వ స్థానానికి పడిపోయింది. గతంలో 7వ స్థానంతో 186 దేశాలకు అనుమతుండగా, ఇప్పుడు కూడా అమెరికా పౌరులు అదే 186 దేశాలకు వీసారహిత ప్రయాణాలు చేయవచ్చు.
భారత్ తన 82 వ ర్యాంక్ పాస్‌పోర్ట్‌తో 58 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయగలిగే అవకాశం కలిగివుంది. పొరుగు దేశమైన పాకిస్తాన్(Pakistan at 100th Rank) 33 దేశాలకు అనుమతితో 100వ స్థానంలో ఉండగా, అట్టడుగున ఉన్న అఫ్ఘనిస్తాన్(Last is Afghanistan with 103 Rank)కు 26 దేశాలకు మాత్రమే అనుమతి ఉంది. దీని ర్యాంకు 103.
హెన్లీ అండ్ పార్ట్నర్స్( Henley and Partners) కంపెనీ ఈ పాస్‌పోర్ట్ జాబితాను రూపొందిస్తుంది. గత 19 సంవత్సరాలుగా 227 దేశాలు, ప్రాంతాల(227 countries and territories) వీసా రహిత ప్రయాణాలను నిరంతరంగా పరిశీలిస్తోంది. ఐటా (IATA)ఇచ్చే ప్రత్యేక సమాచారంతో ఈ జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూఉంటాయి. ఇది వివిధ దేశాల వీసా అనుమతులు(visa policy changes) మారినప్పుడు జరుగుతుంటుంది.