Zika virus | మహారాష్ట్రలో ‘జికా’ కలకలం.. ఓ వైద్యుడికి ఆయన కుమార్తెకు పాజిటివ్‌..!

Zika virus | మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. బుధవారం పుణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్‌కు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సదరు వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించాయి. దాంతో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

  • By: Thyagi |    national |    Published on : Jun 26, 2024 8:46 PM IST
Zika virus | మహారాష్ట్రలో ‘జికా’ కలకలం.. ఓ వైద్యుడికి ఆయన కుమార్తెకు పాజిటివ్‌..!

Zika virus : మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. బుధవారం పుణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్‌కు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సదరు వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించాయి. దాంతో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు రక్త నమూనాలను సేకరించి నగరానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపించారు.

ఆ పరీక్షల్లో వైద్యుడికి జికా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో అతనితోపాటు ఉన్న ఆయన కుమార్తె రక్త నమూనాలను కూడా పరీక్షంచగా ఆమెలో కూడా జికా పాజిటివ్‌ వచ్చింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాలను వెల్లడించింది. సదరు డాక్టర్ నగరంలోని ఎరంద్వానే ప్రాంత నివాసి అని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ఆ వైద్యుడి కుటుంబసభ్యుల రక్త నమూనాలను విశ్లేషిండంతో ఆయన 15 ఏళ్ల కుమార్తెకు కూడా జికా వైరస్ సోకినట్లు గుర్తించామని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు.