13 మంది మావోయిస్టులు లొంగుబాటు

  • By: raj    news    Jun 28, 2025 8:02 PM IST
13 మంది మావోయిస్టులు లొంగుబాటు

విధాత : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉండగా.. వారిపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.50వేలు సహాయం అందించామన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో భారీ ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లలో మావోయిస్టులకు భారీగా నష్టం ఎదురువుతుంది. ఇప్పటికే 500మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లలో హతమవ్వగా..వేలాదిగా లొంగిపోతున్నారు.