Raghava Lawrence : సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్

తన సొంతింటిని పాఠశాలగా మార్చి నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందించనున్న రాఘవ లారెన్స్, సేవా కార్యక్రమంలో మరో ముందడుగు వేశారు.

Raghava Lawrence : సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్

విధాత: నిరుపేదలకు, అనాథలకు, సాయంకావాలని తన వద్దకు వచ్చినవారికి రాఘవ లారెన్స్ ఎంతగానో సాయం చేస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే లారెన్స్ తాజాగా మరో నిర్ణయం తీసుకొని తన ఉదారతను చాటుకున్నాడు. తాను ఎంతగానో కష్టపడి కట్టించుకున్న సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్లు ప్రకటించాడు. ఆ స్కూల్‌లో విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించనున్నాడు. ఇంతకు ముందు ఆ ఇంటిని ఆనాథాశ్రమంగా ఉంచగా, ఆ ఇంట్లోనే పెరిగిన ఓ విద్యార్థి ఇప్పుడు ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పాఠాలు చెప్పనున్నట్లు తెలిపాడు. ’నా ఇంటిని మరోసారి సేవా కార్యక్రమానికి వినియోగిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశిస్సులు కావాలి. మీరంతా నాకెప్పుడూ మద్దతిస్తారని ఆశిస్తున్నా‘. అని లారెన్స్ వెల్లడించాడు.