Allu Arjun- Atlee | అల్లు అర్జున్- అట్లీ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. దీపికా, మృణాల్ పాత్ర‌లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు!

Allu Arjun- Atlee | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి.

  • By: sn |    news |    Published on : Nov 24, 2025 12:27 PM IST
Allu Arjun- Atlee | అల్లు అర్జున్- అట్లీ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. దీపికా, మృణాల్ పాత్ర‌లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు!

Allu Arjun- Atlee | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ రూపొందిస్తున్న ఈ మాస్–ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇప్పటి వరకు బయటకొస్తున్న అప్డేట్లు అన్నీ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకటి కాదు, మొత్తం నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా చిత్రంలో బ‌న్నీ క‌నిపించ‌నున్నార‌ట‌. టైమ్ ట్రావెల్, పునర్జన్మ వంటి ఫ్యాంటసీ అంశాలతో కథ సాగుతుందన్న చర్చ ఇండస్ట్రీలో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తుండగా, ఆమెతో పాటు ర‌ష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే ఇలా మొత్తం ఐదుగురు హీరోయిన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారనే వార్త ఇటీవ‌ల‌ వెలుగులోకి వచ్చింది. సినిమా స్కేల్ దృష్ట్యా, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ VFX సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు తీర్చిదిద్దేందుకు ప్రత్యేక టీమ్ ఒక కొత్త ప్రపంచాన్ని (New Universe) సృష్టించడంపై పని చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు ₹700 కోట్లు అని ఫిల్మ్ నగర్‌లో చర్చ న‌డుస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.చిత్రంలో దీపిక పదుకొనె లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందని.. ఆమె ఒక లేడీ డాన్ గా కనిపిస్తోందని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక మ‌రో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ గా నటించ‌నుంద‌ని స‌మాచారం. అ వార్త‌ల‌పై పూర్తి క్లారిటీ లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి.