విధాత:అమరరాజా సంస్థల చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు మీడియాతో మాట్లాడుతూ అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణం.మనదేశంలో గ్రామల్లో నివసించేవారే అధికం,గ్రామీణులకు ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నానని చెప్పారు.18 ఏళ్లు అమెరికాలో ఉండి స్వదేశానికి మామ రాజగోపాలనాయుడు సూచనతో వచ్చా,మా తండ్రి నుంచి ధైర్యం, ఇతర పాఠాలు చేర్చుకున్నాను. మామ రాజగోపాలనాయుడు స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చామని తెలిపారు.
పరిశ్రమకు సాగుభూమి వాడకూడదనే నిబంధన పెట్టుకున్నాం,1985లో చిన్న గ్రామం కరకంబాడిలో పరిశ్రమ మొదలు పెట్టి అనంతరం మా స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమ స్థాపించాం.మా ప్లాంట్లన్నీ గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం,కరకంబాడిలో రూ.2 కోట్లతో 22 మందితో పరిశ్రమ ప్రారంభించి చిత్తూరు జిల్లాలో రూ.6 వేల కోట్ల స్థాయికి విస్తరించాం.
ఒక్కో అడుగు ముందుకు వేశాం ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ అత్యుత్తమైన ఉత్పత్తులు అందిస్తూ ఎకానమీ అభివృద్ధికి కృషి చేశాం విద్యార్హత లేనివారికి కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చాము,గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఉద్యోగులుగా తీసుకుని వారికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాము.
మేం సమాజాభివృద్ధిని కోరుకున్నాం కనుకనే సొసైటీ కోసం మొదటిసారిగా ట్రస్టు ఏర్పాటు చేశాం 1990లో తొలిసారి ఆధునిక సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉత్పత్తుల తయారీ చేశాం.మా సంస్థల్లో ఇప్పుడు 18 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి,మా సంస్థల ద్వారా సుమారు 60 వేల మందికి పరోక్ష ఉపాధి కలుగుతుందని వెల్లడించారు.