విధాత:కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు కేంద్రం గెజిట్లను విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గెజిట్లను విడుదల చేయనున్నారు. రెండు బోర్డులకు వేర్వేరుగా గెజిట్లను విడుదల చేయనున్నారు. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యం ఏర్పడింది.