Srisailam | శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్ల కలకలం

  • By: TAAZ    news    Jun 23, 2025 9:29 PM IST
Srisailam | శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్ల కలకలం

Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో తుపాకి బుల్లెట్లు కనిపించడం కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ చెట్ల మధ్య పారిశుధ్య సిబ్బందికి ఓ కవరు లో 13 బుల్లెట్లు కనిపించాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కవర్ తెరిచి చూడగా 9 పెద్ద, 4చిన్న బుల్లెట్లు లభించాయి. కొన్ని పేల్చిన తూటలు. 4 బాంబులు, ఒక ఎస్ ఎల్ ఆర్ తుపాకీ పౌచ్, ఎర్ర జెండా లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనేక తనిఖీల మధ్య కొండపైకి బుల్లెట్లతో ఎలా వచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నారు.