విధాత:పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబరు గేటు కొట్టుకుపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.గేటు తొలగిపోయినందు వల్ల దాదాపు 34 టిఎంసిల నీరు వృధాగా సముద్రం పాలవుతుందన్నారు.దీనివల్ల పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని ప్రాజెక్టు నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్ పై, నాటి ఇంజనీర్లు, అధికారులపై చర్యలు చేపట్టాలని16వ నెంబరు గేటు తొలగిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.