మలుపుల్లో మరణాలు..డ్రైవర్ల నిర్లక్ష్యం

వీధి మలుపులు, రోడ్డు మలుపుల్లో వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణనష్టం జరుగుతుండటం చూస్తుంటాం. అలాగే డ్రైవర్లు వీధి మలుపులో ఒకే వైపు చూస్తు నడపడం ద్వారా జరిగిన ప్రాణనష్టాల వీడియోలు వైరల్ గా మారాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలోని రూర్కీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు తోలడంతో యువతి దుర్మరణం చెందిన ఘటన విషాదాన్ని రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి డ్రైవర్ నిర్లక్ష్యంతో చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో సైతం నాలుగేళ్ల చిన్నారి కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు. మూల మలుపు వద్ద రోడ్డు ఓ వైపు ఆడుకుంటున్నబాలుడిని గమనించకుండా కారు డ్రైవర్ ముందుకు వెళ్లాడు. ప్రమాదంలో కారు కింద పడి బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి పక్కన నిలబడిన మరో ముగ్గురు బాలురులతో మరో ఇద్దరిని కూడా కారు తగిలినప్పటికి అదృష్టవశాత్తు వారు కారు కింద పడకుండా తప్పించుకున్నారు. ఈ ప్రమాద వీడియోను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యులు కారు డ్రైవరా? చిన్నారి తల్లిదండ్రులా? అని ప్రశ్నించారు.