17 వందల కోట్ల ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన‌ ఉప్పలపాటి హిమబిందు

విధాత‌:విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమ బిందు,ఉప్పలపాటి వెంకట రామారావు, వెంకటరమణ పై 2018 లో సీబీఐ కేసు నమోదు చేయ‌గా సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈ డి.నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుండి రుణాలు పొందిన విఎంసి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.ఈడీ విచార‌ణ‌కు డైరెక్ట‌ర్లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఉప్పలపాటి హిమబిందును అరెస్టు చేశారు.మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 539 […]

  • Publish Date - August 6, 2021 / 04:11 AM IST

విధాత‌:విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమ బిందు,ఉప్పలపాటి వెంకట రామారావు, వెంకటరమణ పై 2018 లో సీబీఐ కేసు నమోదు చేయ‌గా సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈ డి.నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుండి రుణాలు పొందిన విఎంసి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.ఈడీ విచార‌ణ‌కు డైరెక్ట‌ర్లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఉప్పలపాటి హిమబిందును అరెస్టు చేశారు.మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 539 కోట్లు,ఎస్బిఐ,ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ నుండి 1207 కోట్లు రుణం పొందిన విఎంసి సిస్టమ్స్ కంపెనీ, బిఎస్ఎన్ఎల్ నుండి రావాల్సిన బకాయిలు వస్తె చెల్లిస్తామని 2018లో సీబీఐకి తెలిపిన కంపెనీ డైరెక్టర్లు. 33 కోట్లు బకాయిలు ఉంటే 262 కోట్లు బిఎస్ ఎన్ ఎల్ నుండి రావాల్సి ఉందని సీబీఐని తప్పు దోవ పట్టించిన కంపెనీ డైరెక్టర్లు.