ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో & కార్యక్రమాలలో పాల్గొనవ‌ద్దు

విధాత‌: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మరియు జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల యొక్క భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు, & స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం & కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం […]

  • Publish Date - August 21, 2021 / 04:33 PM IST

విధాత‌: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మరియు జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల యొక్క భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు, & స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం & కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

దీనికి స్పందించిన పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా ప్రతినిధుల (వార్డ్ సభ్యులు, సర్పంచ్, MPTC, ZPTC, MPP, ZPP) కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో & కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదు.పాల్గొంటున్నారని తెలిస్తే, సంబంధిత పంచాయతీ సెక్రటరీ, MPO, MPDO, DPO, ZP CEO లపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని… అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 – సెక్షన్ 37(5) ప్రకారం (women) ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి.ఇలాంటి సమస్యలు ప్రజలు చూస్తే పంచాయతీ రాజ్ కమీషనర్ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Latest News