minister seethakka । మండలానికో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీ : మంత్రి సీతక్క
వరదలు వచ్చినప్పడు ఏమి చేయాలన్న దానిపై స్థానికంగా నిర్ణయం తీసుకొని వెంటనే అమలు చేసే విధంగా ప్రతి మండలానికి ఐదురుగు అధికారులతో ఫ్లడ్ మేనేజ్ మెంట్ కమిటీలు వేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
minister seethakka । వరదలు వచ్చినప్పడు ఏమి చేయాలన్న దానిపై స్థానికంగా నిర్ణయం తీసుకొని వెంటనే అమలు చేసే విధంగా ప్రతి మండలానికి ఐదురుగు అధికారులతో ఫ్లడ్ మేనేజ్ మెంట్ కమిటీలు వేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాణాళిక రూపొందించుకుని పనిచేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రహదారుల పునరుద్దరణ పై మంత్రి సూచనలు చేశారు. వెంటనే పునరుద్దరణ పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువల పై వెలసిన అక్రమ కట్టడాల జాబితాను జిల్లా కలెక్టర్ కు అందచేయాలని ఆదేశించారు.ఈ కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని సిబ్బందికి సూచించారు. వరద ప్రభావం లేని గ్రామాల నుంచి సిబ్బందిని వరద ప్రాంతాల్లోకి తరలించి పారిశుధ్య పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్దిచేయాన్నారు. తాగు నీటి క్లోరినేషన్ కు అధిక ప్రధాన్యతనివ్వాలని తెలిపారు. పనిచేసిన సిబ్బందిని ప్రశంసిస్తానని ఆమె చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram