JAGADISH REDDY |
వాహనదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న మున్సిపాలిటీలో గ్యాస్ ఏజెన్సీ వంటి సేవలు రావడం సంతోషకరమనన్నారు. అనంతరం ఫిల్లింగ్ స్టేషన్ యాజమానులు విక్రమ్ రెడ్డి, సుమలత దంపతులు మంత్రిని సన్మానించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, 20వ వార్డ్ కౌన్సిలర్ గీతాశ్రీరాములు ఇతర ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు