తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో గణనీయ స్థాయిలో వరద పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆల్మట్టి నుంచి దిగువకు నారాయణపూర్ డ్యాంకు కృష్ణమ్మ ఊరకలేస్తుంది. ఈ క్రమంలో నారాయణపూర్ ప్రాజెక్టు 8 గేట్లు తెరిచి దిగువనున్న జూరాల వైపు నీటి విడుదల చేశారు. అటు భీమా నది నుంచి అదనపు ప్రవాహం జూరాలలో కలిసే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు గేట్లు తెరిచి 30,722 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 315.91 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలగానూ ప్రస్తుత నీటి నిల్వ 5.042 ఉన్నది. ప్రస్తుతం ఆల్మట్టి గేట్లు మూసివేసినప్పటికి పవర్ హౌస్ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది.
జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత 😍
శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ పరవళ్లు.!ఇన్‌ఫ్లో: 32,000 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో: 30,722 క్యూసెక్కులు#Jurala#Srisailam
VideoVikas pic.twitter.com/mYp1IqZB4X— Hi Kollapur (@HiKollapur) July 28, 2026