CWC సమావేశాల్లో కీలక తీర్మానాలు

  • By: sr    news    Apr 08, 2025 7:35 PM IST
CWC సమావేశాల్లో కీలక తీర్మానాలు

విధాత: అహ్మదాబాద్ వేదికగా మంగళవారం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశంతో పలు కీలక అంశాలపై చర్చించారు. తొలి రోజు జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో 7కీలక తీర్మానాలు ఆమోదించారు.

1)రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం

నల్లచట్టాలు, ఎంఎస్పీ పెంపు లాంటి అంశాలపై రైతులకు అండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాటం చేయాలని, బీజేపీ క్రూరమైన బ్రిటిష్ విధానాలను అవలంబిస్తుందని తీర్మానం చేశారు.

2) దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం

బీజేపీ దేశంలో ఐక్యత స్పూర్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని.. ప్రాంతీయ విద్వేషాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. సర్దార్ పటేల్ బలమైన నాయకత్వం, జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టితో దేశంలో 560కి పైగా సంస్థానాలు విలీనమై ప్రజాస్వామ్య పునాది పడిందని.. దీనిని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మండిపడింది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేసింది.

3) కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటం, 4) సామాజిక న్యాయం కోసం పోరాటం, 5) సమాజంలో అసమానతలు, అంతరాలపై పోరాటాలు చేయాలని తీర్మానించింది. బ్రిటీష్ వారు దేశ వనరులు దోచుకున్నారని., ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడి సంపదను దోచుకుంటోందని.. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ ఖజానాను ఉపయోగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది సమాజంలో అసమానతలను, అంతరాలను పెంచుతోందని.. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు.

6) హింసా, మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం

సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఫిబ్రవరి 4, 1948లో ఆర్ఎస్ఎస్ ను నిషేధించారని గుర్తు చేసింది. తన లేఖలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గురించి ప్రస్తావించారు. కానీ నేను హింస, మతతత్వం భావజాలం దేశాన్ని అగాధంలోకి నెట్టివేస్తోందన్న కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ నిశ్చయతను అనుసరించాలని తీర్మానం చేసింది.

7) గాంధీ-నెహ్రూ-పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వంపై ప్రస్తుతం దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విభజన శక్తుల్ని ఎదుర్కోవాలని తీర్మానం చేసింది.