తిరుమ‌ల‌లో ధ‌న ప్ర‌సాదం

విధాత‌: తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుండీలో వేసిన నాణేలను భక్తులకు ధన ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గదుల కోసం డిపాజిట్‌ చేసిన నగదును ధన ప్రసాదం పేరుతో చిల్లర రూపంలో భక్తులకు ఇవ్వనుంది. తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతుండటం, హుండీ నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నాణేల నిల్వను […]

  • Publish Date - September 2, 2021 / 03:16 AM IST

విధాత‌: తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుండీలో వేసిన నాణేలను భక్తులకు ధన ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గదుల కోసం డిపాజిట్‌ చేసిన నగదును ధన ప్రసాదం పేరుతో చిల్లర రూపంలో భక్తులకు ఇవ్వనుంది. తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతుండటం, హుండీ నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నాణేల నిల్వను తగ్గించేందుకు తితిదే ఈ నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.