నాలుగు రోజులు తేలిక పాటి వర్షాలు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది
విధాత : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్లాలు పడే అవకావమున్న జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వానలు పడే అవకాశముందని పేర్కోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram