విధాత: కార్వీ ఎండి పార్థసారథి మొదటి రోజు కస్టడీ పూర్తి అయింది. కార్వీ అక్రమాలపై సీసీఎస్ పోలీసులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. 720 కోట్ల షేర్లు బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన అంశాలపై, బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.3వేల కోట్లు ఎక్కడికి మళ్లించారనే దానిపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. కార్వి సంస్థ ఆడిట్ రీపోర్ట్‌ను పోలీసులు పరిశీలించారు. కార్వీ సంస్థకు సంబంధించిన 6 బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లపై పోలీసులు ఆరా తీశారు.