Mahesh Kumar Goud : స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కార్పోరేషన్ పదవుల భర్తీ
మహేశ్ కుమార్ గౌడ్ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కార్పోరేషన్ పదవులు భర్తీ, పార్టీని గ్రామ స్థాయినుంచి బలోపేతం చేస్తాం.

త్వరలో అన్ని పార్టీ కమిటీలు పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్ బి. మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు పార్టీ జిల్లా కమిటీల నియామకానికి ఇంకా యసమయం పట్టే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ లో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కార్పోరేషన్ పదవులను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తోందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేస్తానని అంటున్నారని.. ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పినట్టు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పారు. గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయడంపై పీసీసీ ఫోకస్ పెట్టింది. సంస్థాగత ఎన్నికల్లో దీనిపై ఫోకస్ పెట్టనుంది..