Taj Mahal | తాజ్‌మ‌హాల్‌కు టూరిస్ట్.. కారులో చిక్కుకుపోయి మూగజీవి మృతి!

Taj Mahal విధాత‌: నిర్ల‌క్ష్యం, మ‌తిమ‌రుపు కార‌ణంగా కొన్ని సంద‌ర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. మూగ జీవాల‌ను త‌మ వెంట తెచ్చుకున్నప్పుడు యాజ‌మానులు ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది. లేని ప‌క్షంలో ఆ జీవులు ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి దారుణ ఘ‌ట‌న ఇటీవ‌ల తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద చోటు చేసుకున్న‌ది. Tourist from Haryana came to Agra visit Taj Mahal Tourist had brought a pet dog with him, […]

  • By: Somu    news    Jul 05, 2023 1:59 AM IST
Taj Mahal | తాజ్‌మ‌హాల్‌కు టూరిస్ట్.. కారులో చిక్కుకుపోయి మూగజీవి మృతి!

Taj Mahal

విధాత‌: నిర్ల‌క్ష్యం, మ‌తిమ‌రుపు కార‌ణంగా కొన్ని సంద‌ర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. మూగ జీవాల‌ను త‌మ వెంట తెచ్చుకున్నప్పుడు యాజ‌మానులు ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది. లేని ప‌క్షంలో ఆ జీవులు ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి దారుణ ఘ‌ట‌న ఇటీవ‌ల తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద చోటు చేసుకున్న‌ది.

హ‌ర్యానాకు చెందిన ఓ వ్య‌క్తి ఇటీవ‌ల ఆగ్రాలోని ప్రముఖ తాజ్ మహల్‌ సంద‌ర్శ‌న‌కు కారులో త‌న పెంపుడు కుక్క‌తో పాటు వ‌చ్చాడు. కారు పార్క్‌ చేసి త‌న పెంపుడు కుక్క బ‌య‌ట‌కు వ‌చ్చిందా? లేదా అని చూసుకోకుండానే డోర్ లాక్ చేసి తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శ‌న‌కు వెళ్లాడు. కొన్ని గంట‌లైనా తిరిగి రాలేదు. ఆ తెల్ల‌ని కుక్క గాలి అంద‌క‌, ఊపిరి ఆడ‌క‌, వేడికి కారు లోపల సీటు మ‌ధ్య‌ నిర్జీవంగా ప‌డి పోయింది.

వేడికి తట్టుకోలేక కారులో దూకుతున్న సమయంలో కుక్క మెడకు కట్టిన పట్టీ హ్యాండ్‌బ్రేక్‌లో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్టు తెలుస్తున్న‌ది. కాళ్లు పైకిలేపి వెల్ల‌కిలాల ప‌డి చ‌నిపోయిన కుక్క వీడియోను చుట్టుపక్కల ప్రజలు తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. దానిని సోషల్ మీడియాలో షేర్‌ చేయ‌గా, వైర‌ల్‌గా మారింది. కుక్క యజ‌మాని తీరుపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు