PNB హౌసింగ్ ఫైనాన్స్ చేయుత.. విద్యార్థులకు ఉపకారవేతనాలు

ఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) విభాగం పహెల్ ఫౌండేషన్ ద్వారా, ఉన్నత విద్యను అభ్యసించాలనే స్వప్నాలతో ఉన్న మిరాండా హౌస్ కళాశాలకు చెందిన 186 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్‌ను ప్రదానం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన యువతులకు ఉన్నత విద్యావకాశాలను కొనసాగించడానికి ఈ మద్దతు లభించింది. సైన్స్, హ్యుమానిటీస్‌తో సహా వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను పూర్తి చేయడానికి ఈ స్కాలర్‌షిప్‌లు తోడ్పడతాయి. యువ మహిళలకు సాధికారత కల్పించడం, అట్టడుగు వర్గాలకు సమాన విద్యా అవకాశాలను అందించడం అనే తమ లక్ష్యాన్ని ఈ చొరవ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ పునరుద్ఘాటించింది.
అర్హత, సామాజిక-ఆర్థిక నేపథ్య అంచనా తర్వాత మంజూరు అయిన ఈ స్కాలర్‌షిప్‌లు, మూడు సంవత్సరాల వరకు వార్షిక ట్యూషన్ ఫీజులను కవర్ చేస్తాయి. తద్వారా అవార్డు గ్రహీతలు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా తమ డిగ్రీలను పూర్తి చేయగలరు. ఈ పథకం నిర్మాణం, దాని సానుకూల ప్రభావంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక ఓరియంటేషన్ సెషన్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సీఈఓ & ఎండీ గిరీష్ కౌస్గి మాట్లాడుతూ, “నాణ్యమైన విద్య మెరుగైన అవకాశాలకు ఈ స్కాలర్‌షిప్‌లు బాసటగా నిలుస్తాయి. ఇది బలమైన దేశ నిర్మాణానికి దారితీస్తుందని నమ్ముతున్నాము. ఈ స్కాలర్‌షిప్, 186 మంది యువతుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారి పట్టుదలకు, కృషికి మా మద్దతును అందజేస్తుంది. ఇది కేవలం విద్యకు నిధులు సమకూర్చడం మాత్రమే కాదు – ప్రతి ఒక్కరికీ, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ఎదగడానికి, నాయకత్వం వహించడానికి, అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తుంది” అని అన్నారు.