Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 2 లక్షల 50వేల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖలు, వైద్య, విద్య, ఆరోగ్య, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలలో ఏళ్ల తరబడి పని చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. వీరికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా వీరికి జీతాలు ఇవ్వలేదని తెలిపారు. పైగా అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని చెబుతూ.. వీరికి వెంటనే జీతాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Outsourcing Employees | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీ రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో వందల మంది పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన కృష్ణయ్య.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు 20-25 సంవత్సరాల నుండి పని చేస్తున్నా.. వారికి ఉద్యోగ భద్రత లేదని చెప్పారు. సరిపోను జీతాలు లేవని, పర్మినెంట్ కావడం లేదని తెలిపారు. పైగా నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐకార్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పదివేల నుండి 25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వీరు 20-25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని. వీరిని దశల వారీగా రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
రాష్ట్రంలో రెండున్నర లక్షల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 2 లక్షల 50వేల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖలు, వైద్య, విద్య, ఆరోగ్య, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలలో ఏళ్ల తరబడి పని చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. వీరికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా వీరికి జీతాలు ఇవ్వలేదని తెలిపారు. పైగా అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని చెబుతూ.. వీరికి వెంటనే జీతాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిందాలని సుప్రీంకోర్టులో అనేక తీర్పులు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని కృష్ణయ్య విమర్శించారు. 240 రోజులు రెగ్యులర్ గా పనిచేసిన వారిని పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వేసిన కేసులలో తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేశారని గుర్తు చేసారు. ఈ ధర్నాలో బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బాలస్వామి, బుపిష్ సాగర్, రాజు నేత తదితరులు మాట్లాడారు.