ఏపీ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలి..!
విధాత: ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో ఏపీలో రాజకీయ […]

విధాత: ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.అందుకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్ నిర్వహించింది.పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు