Shine Tom Chacko | ఏంటీ.. నాని విలన్ ఇంత విచిత్రంగా ఉన్నాడు.. వింత చేష్టలు? నిజంగానే తిక్కా ఏంటి
Shine Tom Chacko విధాత: సినిమాల్లో ఏ క్యారెక్టర్ చేస్తే నిజజీవితంలోనూ స్వభావపరంగా అలాగే ఉంటారనుకోవడం సినిమా వాళ్ళను వీర లెవల్లో అభిమానించే సగటు ప్రేక్షకులందరికీ అలవాటైన ధోరణే. కానీ నిజ జీవితానికి, సినిమాలో చేసే పాత్రకు ఎక్కడా పోలికలుండవు. సినిమాలో విలన్ పాత్రలు చేసే వారంతా నిజ జీవితం లోనూ విలన్ స్వభావంతో ఉండాలనేం లేదు. ఇదే విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు నెటిజన్లు. ఇక విషయంలోకి వస్తే.. దసరా సినిమాలో చిన్న నంబి పాత్రలో […]

Shine Tom Chacko
విధాత: సినిమాల్లో ఏ క్యారెక్టర్ చేస్తే నిజజీవితంలోనూ స్వభావపరంగా అలాగే ఉంటారనుకోవడం సినిమా వాళ్ళను వీర లెవల్లో అభిమానించే సగటు ప్రేక్షకులందరికీ అలవాటైన ధోరణే. కానీ నిజ జీవితానికి, సినిమాలో చేసే పాత్రకు ఎక్కడా పోలికలుండవు. సినిమాలో విలన్ పాత్రలు చేసే వారంతా నిజ జీవితం లోనూ విలన్ స్వభావంతో ఉండాలనేం లేదు. ఇదే విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు నెటిజన్లు. ఇక విషయంలోకి వస్తే..
దసరా సినిమాలో చిన్న నంబి పాత్రలో నటించిన మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రస్తుతం తన విచిత్ర ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. దసరాలో విలన్ అయినంత మాత్రాన నిజ జీవితంలోనూ అంత సీరియస్‌గానే ఉండాలా అన్నట్టు తయారయ్యాడట షైన్ టామ్. తనకు నచ్చినట్టు ఉండటం కూడా తప్పంటే ఎట్లా? అంటూ కామెడీ పనులు చేస్తూ.. కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తూ.. చూడగానే ఈ మనిషికి తిక్కుందేమో అనుకునేట్టుగా బిహేవ్ చేస్తుండటం నిజంగా విడ్డూరమనే చెప్పుకోవాలి.
దసరా తర్వాత తెలుగులో షైన్ టామ్ నటించిన చిత్రం నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షైన్ టామ్ కూడా పాల్గొన్నాడు.
ఈ కార్యక్రమంలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతున్న సందర్భంలో యాంకర్ మీ షర్ట్ చాలా బావుందని అనగానే.. వెంటనే షర్ట్ విప్పేసి ఇచ్చేయ బోయాడు. ఆ పనికి అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి ఏంటీ మనిషి ఇలా చేస్తున్నాడని వింతగా చూడటం మొదలెట్టారు. ఇదే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘మన్మథుడు’ సినిమాలో హీరో నాగార్జున ఇలాగే షర్ట్ విప్పి, కారు తుడిచే పిల్లాడికి దానం చేసిన సీన్ చూడగానే తెగ పొంగిపోయి రియల్ హీరో అన్న ప్రేక్షకులు, నిజ జీవితంలో పాపం అదే పని చేసిన షైన్ టామ్‌ని మాత్రం తెగ ఆడేసుకుంటున్నారు.
ఎంతైనా అతి చేయ కూడదనేది వాళ్ళ అభిప్రాయం. గతంలో కూడా షైన్ టామ్ ఇలానే చేశాడనే అతని వీడియోలు కొన్ని బయట పెడుతున్నారు. మరి కావాలని చేస్తున్నాడో.. లేదంటే నిజంగానే తిక్క ఉందో తెలియదు కానీ.. ఆయన చేష్టలు వైరల్ అవుతూ.. నెటిజన్లకి బాగా పని కల్పిస్తున్నాయి.