వశిష్ట సింహ (Vasishta), సత్యరాజ్ (Satya Raj), సత్యం రాజేశ్, ఉదయ భాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం త్రిభాణదారి బార్బరిక్ (Tribanadhari Barbarik). ప్రముఖ దర్శకుడు మారుతి కంపౌండ్ నుంచి వస్తు ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స ( Mohan Srivatsa) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నీ వల్లే (Neevalle) అంటూ సాగే ఓ మెలోడిని రిలీజ్ చేశారు. రఘురాం ఈ పాటకు సాహిత్యం అందించగా ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ (Infusion Band) సంగీతం అందించింది. అయితే చాలా విరామం తర్వాత సిద్ శ్రీరాం (Sid Sriram) ఈ పాటను ఆలపించడం విశేషం.