సింగూరు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి

సింగూరు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

సింగూరు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి

పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ

వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత) : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. అయితే ఉమ్మడి మొదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కాలువకు పుల్కమ్ మండలంలోని ఇసోజు పేట గ్రామంలో గండి పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం గండి పడ్డ ప్రాంతానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి వెళ్లి పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని నీటి పారుదల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర ఆదేశించారు.