Job notifications | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!.. త్వరలో 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

Job notifications | తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించబోతుంది. ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారం కావడంతో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ(Job notifications)కి ప్రభుత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. 2024-25 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రతిపాదనలలో అవసమైన మార్పులు చేర్పులు చేస్తూ.. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలను తీసుకుని సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం..
వాస్తవానికి ఉద్యోగాల భర్తీకి 2024-25 ఏడాదికి ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీకి, ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలను పంపించాయి. అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయి వరకు కొత్త నోటిఫికేషన్లు జారీకి రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ తిరిగి చేపట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు సవరణలు చేసి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీసు విద్యుత్తు, గురుకుల, వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. అలాగే బ్యాక్ లాగ్ గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రూప్స్ తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నాయి ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10వేల వరకు పోస్టులు రాబోతున్నాయి. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్తు సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గురుకుల నియామకాల్లో దాదాపు 2000 పోస్టులు బ్యాక్ లాగ్ గా ఉన్నట్లుగా సమాచారం. ఆయా విభాగాల పోస్టుల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు త్వరలో వెలువడబోతుండటం.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కొత్త ఆశలు కల్పించేదిగా ఉంది.
ఇవి కూడా చదవండి..
I&PR Telangana | తెలంగాణ ఐఅండ్‌పీ ఆర్ డైరెక్టర్ కిశోర్‌పై తిరుగుబాటు!
Telangana Jagruthi | కవిత దూకుడు! జాగృతి విభాగాలకు కన్వీనర్లు
Sridhar babu: మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట
South West Monsoon | రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులు మోస్తరు వానలు.. అక్కడక్కడ భారీ వర్షాలు