విధాత, హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. 1991వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ. ఆనంద్ హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సీపీగా పనిచేశారు.
డీజీపీ నియామక ప్రక్రియలో భాగంగా ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది.
