తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
విధాత,హైదరాబాద్: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో ద్రోణి, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం […]

విధాత,హైదరాబాద్: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో ద్రోణి, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..